Fakhar Zaman Wicket India vs Pakistan | ఫఖర్ జమాన్ ఔట్ సరైన నిర్ణయమేనా?

ఆసియా కప్ 2025 లో భాగంగా సూపర్ ఫోర్‌లో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ ప్లేయర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ క్యాచ్ పట్టాడు. ఇప్పుడు ఈ క్యాచ్ వివాదంగా మారింది. వికెట్ల వెనుక ఉన్న సంజూ క్యాచ్ పట్టినప్పుడు బాల్ నెలను తాకిందా? లేదా చేతుల్లోనే పడిందా? అనే వివాదం మొదలైంది. థర్డ్ అంపైర్ చెక్ చేసి అవుట్ గా ప్రకటించారు. ఫఖర్ షాక్ కు గురైయ్యాడు. తన వికెట్ పై అసహనం వ్యక్తం చేస్తూ గ్రౌండ్ ను వీడాడు. 

ఫఖర్ జమాన్ 9 బంతులలో 15 పరుగులు చేశాడు. అయితే సంజూ క్యాచ్ పట్టినప్పుడు తాను అవుట్ కాదు అనుకోని ఫఖర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. దాదాపు అన్ని రీప్లేలు చూసిన తర్వాత అంపైర్ అవుట్ ఇచ్చాడు. పాక్ కోచ్ మైక్ హెసన్ కూడా ఈ నిర్ణయం పై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola