Suryakumar Ind vs Ned T20 World Cup | బౌలింగ్ ఆప్షన్లపై సూర్య షాకింగ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమ్ లో ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ గురించి సూర్య ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. "జట్టులో ఎక్కువ మంది బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా నాకు పెద్ద తలనొప్పిగా మారింది" అని అన్నాడు. హార్దిక్ ( Hardik Pandya ), దూబే ( Shivam Dubey ) వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో ఎవరితో బౌలింగ్ చేయించాలో తేల్చుకోవడం సవాలుతో కూడుకున్నదని, అయితే ఇది జట్టుకు మంచి అంశమని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లు మారడం మాకు కలిసి వస్తుందని సూర్య తెలిపాడు.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబేపై సూర్య ప్రశంసల జల్లు కురిపించాడు. "ముందుగా బ్యాటింగ్ చేసి 193 పరుగులు సాధించడంలో దూబే ఇన్నింగ్స్ సూపర్. మిగిలిన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న చోట అతను అలవోకగా సిక్సర్లు బాదాడు. గతంలో విశాఖలో న్యూజిలాండ్‌పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను ఇది గుర్తుచేసింది అని కొనియాడాడు.