India vs Netherlands T20 World Cup Highlights | నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ( India vs Netherlands ) 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది భారత్.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలినా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ), తిలక్ వర్మ ( Tilak Verma ) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కానీ, అసలైన విధ్వంసం శివం దూబే ( Shivam Dubey ) బ్యాట్ నుండి మొదలైంది. కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి, నెదర్లాండ్స్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. చివర్లో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) మెరుపులతో భారత్ 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ మొదట్లో తడబడింది. వరుణ్ చక్రవర్తి తన స్పిన్‌తో మూడు కీలక వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ జట్టును దెబ్బకొట్టాడు. 16 ఓవర్లకే 125 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి నెదర్లాండ్స్ ఓటమి అంచున నిలిచింది. చివరి 12 బంతుల్లో 46 పరుగులు కావాల్సిన దశలో, భారత్‌ను టెన్షన్ పెట్టారు. కానీ, ఆఖరి ఓవర్ వేసిన శివం దూబే కేవలం 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడంతో.. నెదర్లాండ్స్ 176 పరుగులకే పరిమితమైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola