SRH vs DC IPL 2026 Highlights | ఉప్పల్ వేదికగా హ్యాట్రిక్ విజయం

Continues below advertisement

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభం నుంచే భారీ స్కోర్ లభించింది. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా సహకరించకపోయినా, ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) చెలరేగిపోయాడు. కేవలం 68 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో SRH 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినా లక్ష్యం చేరలేకపోయింది. నితీష్ రాణా 57 పరుగులతో ఆకట్టుకోగా, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ ( Sameer Rizvi ) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్ ఎషాన్ మలింగా తన స్పెల్‌తో 4 వికెట్లు తీసి ఢిల్లీ పరాజయానికి కారణం అయ్యాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola