Ishan Kishan Run Out vs DC IPL 2026 | అభిషేక్ కొట్టిన షాట్‌కు కెప్టెన్ ఇషాన్ రనౌట్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ అవుట్ అయిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచే చెలగెరిపోయాడు ఇషాన్. కానీ రనౌట్ కారణంగా పెవిలియన్ చేరడంతో ఫ్యాన్స్ కూడా బాగా డిస్సపాయింట్ అయ్యారు. 

ట్రావిస్ హెడ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడు ప్రదర్శించాడు. కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులు చేసాడు. అయితే నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో అసలు డ్రామా మొదలైంది. ఆ ఓవర్‌లో వరుస సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ, నాలుగో బాల్ ను స్ట్రైట్ షాట్ ఆడాడు.

ఆ బాల్ ను అడ్డుకునే క్రమంలో బౌలర్ నితీష్ రాణా వేళ్లకు తగిలి నేరుగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను తాకింది. అప్పటికే రన్ కోసం క్రీజు దాటిన ఇషాన్ కిషన్, వెనక్కి వచ్చే అవకాశం లేక రనౌట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ కొట్టిన పవర్‌ఫుల్ షాటే ఇషాన్ కిషన్ అవుట్ కావడానికి కారణమైంది. ఈ రనౌట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాపం ఇషాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola