Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

Continues below advertisement

భారత మాజీ క్రికెటర్లు ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య వివాదం మళ్లీ మొదలైంది. IPL 2008 'స్లాప్‌గేట్' ఘటన తర్వాత వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు మారినట్టు కనిపించినా.. భజ్జీ నటించిన ఒక యాడ్ వల్ల పాత గాయాలు మళ్లీ మాన్పాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ను తన రూమ్‌మేట్‌గా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఒకే గదిలో ఉంటే ఇద్దరి మధ్య ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయని అన్నాడు. 

అయితే శ్రీశాంత్ మాత్రం భజ్జీ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఒక ఇంటరాక్షన్‌లో భజ్జీ ఫోటో, బాక్సింగ్ గేర్ చూడగానే శ్రీశాంత్ ఆవేశంతో రగిలిపోయాడు. భజ్జీకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ.. "బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని నా ముందుకు వచ్చే దమ్ము ఉందా? నేరుగా రింగ్‌లోకి వచ్చి ఆడగలవా? ఇది ఏమీ ఆక్టింగ్ కాదు. నా ఫేస్‌లో నవ్వు ఉందని జోక్‌గా తీసుకోకు. నీకు ఎంత దమ్ముందో చూద్దాం.. ఇది నా ఓపెన్ ఛాలెంజ్" అని శ్రీశాంత్ ఘాటుగా హెచ్చరించాడు.

 "భజ్జీ, నిన్ను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నా" అంటూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఒకవైపు హర్భజన్ స్నేహహస్తం చాస్తుంటే, శ్రీశాంత్ మాత్రం బాక్సింగ్ పోరుకు సిద్ధం అనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola