IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

Continues below advertisement

శ్రీలంకతో గాలే వేదికగా జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తన ప్లాన్ ను బయటపెట్టారు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఏకంగా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని అన్నారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజా.. ముగ్గురూ వేర్వేరు స్టైల్ ఉన్న స్పిన్నర్లు కావడంతో, వీరి కాంబినేషన్ ప్రత్యర్థికి పెద్ద సవాలుగా మారనుందని అన్నారు. 

"కుల్దీప్ మన మెయిన్ అటాకింగ్ బౌలర్. జడేజా పక్కా లైన్ అండ్ లెంగ్త్ అక్యూరసీతో బౌలింగ్ వేస్తే, మానవ్ సుతార్ క్లాసికల్ లూపీ స్పిన్‌తో వికెట్లు తీయగలడు. ముగ్గురిదీ డిఫరెంట్ స్టైల్ కావడం వల్ల ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు జట్టులో ఉండటం ఏమాత్రం సమస్య కాదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరిని ఎలా ఉపయోగించుకుంటాడనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది" అని మోర్కెల్ స్పష్టం చేశాడు.

గాలే స్టేడియం ట్రాక్ రికార్డ్, పిచ్ కండిషన్స్ ప్రకారం ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుందని, మైండ్ సెట్ సరైన ఏరియాల్లో బౌలింగ్ చేయడం ఇక్కడ చాలా కీలకమని పేర్కొన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola