Sreesanth About Sanju Samson Shivam Dube | సంజు శామ్సన్ జట్టులో ఉండాలన్న శ్రీశాంత్ | ABP Desam
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అజేయంగా దూసుకుపోతుంది. కానీ ఓటములు ఎదురు కాకపోవడం వల్ల బలహీనతలు బయటపడటం లేదు. అలాంటి బలహీనతే శివమ్ దూబే. ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడని టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటిస్తే యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ మినహా సరైన ఇన్నింగ్స్ ఆడింది కానీ, బౌలింగ్ చేసింది కానీ లేదు. క్యాచ్ డ్రాప్‌లు ఎక్స్‌ట్రా. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఈ విషయంపై మాట్లాడాడు. శివమ్ దూబే స్థానంలో సంజు శామ్సన్‌ను మిడిలార్డర్‌లో ఆడించవచ్చని అన్నాడు. ఈ ప్రపంచకప్‌లో దూబే కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌల్ చేశాడు. తనతో బౌలింగ్ వేయించనప్పుడు సంజు శామ్సన్ ఆ ప్లేస్‌కు బెస్ట్ ఆప్షన్ అన్నాడు. న్యూయార్క్, బార్బడోస్ వంటి బౌలింగ్ ఫ్రెండ్లీ మైదానాల్లో వికెట్లు త్వరగా పడిపోతే సంజు శామ్సన్ యాంకర్ రోల్ పోషించగలడని, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు ఒత్తిడి లేకుండా మ్యాచ్ ఫినిష్ చేయడంలో సాయపడగలరని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లతో అజేయంగా భారత జట్టు సూపర్-8కు చేరుకుంది. జూన్ 20వ తేదీ నుంచి టీమిండియా సూపర్-8 ప్రయాణం మొదలవనుంది. అక్కడ నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.