Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్

టీ20 వరల్డ్ కప్ 2026లో ( T20 World Cup 2026 ) భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే, టీమ్ ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ఆడకపోయినా వరల్డ్ కప్ గెలవడంలో తన పాత్ర ఏంటో సిరాజ్ తన స్టైల్ లో సరదాగా వివరించాడు.

ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే ఈ టోర్నీలో సిరాజ్‌కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. ప్లేయర్స్ అందరు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, తన టీమ్ కు సిరాజ్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి ప్రశ్న ఎదురయ్యింది. 

సిరాజ్ మాట్లాడుతూ.."మేము బయట కూర్చుని చాలా కష్టపడ్డాం" అంటూ జోక్ చేశాడు. అసలైన కష్టం గ్రౌండ్ లో ఆడేవారి కంటే, బయట ఉండి వాటర్ బాటిల్స్ అందించే వారికే ఉంటుందని అన్నాడు. " చాలా పెద్ద రోల్ మాది. బ్యాక్ టు బ్యాక్ వాటర్ బాటిల్స్ తీసుకురావడం, ప్లేయర్ల బ్యాట్‌లు మోయడం.. ఇవన్నీ చిన్న విషయాలు కావు" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తాను తుది జట్టులో లేకపోయినప్పటికీ, నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను సిద్ధం చేయడం, డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంచడం కూడా గెలుపులో భాగమేనని గుర్తు చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola