Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో ( T20 World Cup 2026 ) భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ విజయంలో యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ అంతలా చెలరేగిపోవడానికి కారణం ఒక బ్యాట్ అంటూ సోషల్ మీడియాలో ఒక కథ చక్కర్లు కొడుతోంది. ఆ స్టోరీ ఏంటో చూదాం. 

టోర్నీ ఆరంభం నుండి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ, ఫైనల్ మ్యాచ్ లో చెలగెరిపొయ్యాడు. తన రెగ్యులర్ బ్యాటును కాకుండా, టీమ్ మేట్ శివం దూబే బ్యాటును అడిగి తీసుకున్నాడట. "ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది, అందుకే దూబే బ్యాటుతో బరిలోకి దిగాను" అని మ్యాచ్ తర్వాత అభిషేక్ వెల్లడించాడు. బ్యాట్ మార్చేయడం అభిషేక్ దశను మార్చేసింది. 

శివం దూబే బ్యాటుతో క్రీజులోకి వచ్చిన అభిషేక్, కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మొత్తం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ తో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. "గత నెల రోజులుగా నేను కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను, కానీ టీమ్ నాపై ఉంచిన నమ్మకమే నన్ను రాణించేలా చేసింది" అని అభిషేక్ ఎమోషనల్ అయ్యాడు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola