Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్

గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ ఘనవిజయం సాధించింది. క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిన గిల్, కేకేఆర్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. గుజరాత్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రహానే డకౌట్ కాగా, సీఫర్ట్, రఘువంశీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా కెమెరూన్ గ్రీన్ ( Cameron Green ) ఒంటరి పోరాటంతో స్కోర్ 180 పరుగులకు చేరింది. 

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ క్లాస్ బ్యాటింగ్‌తో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లోనే 86 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు. 8 ఫోర్లు, 4 సిక్సర్లతో సూపర్ అనిపించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola