KKR Lost 6 Matches in a Row IPL 2026 | కేకేఆర్ ఖాతాలో ఆరో ఓటమి

కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి దారుణంగా మారింది. వరుసగా ఆరో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా వదులుకుంటుంది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోను కోల్‌కతా నైట్ రైడర్స్ గేమ్ మారలేదు. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ లో ఉంది. 

అయితే కేకేఆర్ ఓడిపోవడంపై క్రికెట్ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ మెయిన్ ప్రాబ్లెమ్ .. ఓపెనర్స్ భారీ ఇన్నింగ్స్ ను ఆడకపోవడం. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 30 పరుగుల లోపే 2 లేదా 3 వికెట్లు కోల్పోవడం వల్ల మిడిల్ ఆర్డర్‌పై ప్రెషర్ పెరుగుతుంది. 

కెమెరూన్ గ్రీన్‌ ఒక్కడే పోరాడుతున్నాడు. మిగితా ఫారిన్ ప్లేయర్స్ సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్ అంతగా ఆడట్లేదు. కేకేఆర్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టలేకపోతున్నారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ విఫలమవుతున్నారు. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వడం  కేకేఆర్‌కు శాపంగా మారింది. మరి తమ పొరపాట్లని కోల్కతా సరి చేసుకొని ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola