Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్
టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శుబ్మన్ గిల్ T20 ఫార్మాట్‌లో విఫలమవుతున్నాడు. ఎలాగైనా మూడు ఫార్మాట్ లలో గిల్ కు కెప్టెన్సీ అప్పగించాలని ప్రయత్నిస్తుందట బీసీసీఐ. దాంతో శుబ్మన్ గిల్‌పై ఒత్తిడి రోజు రోజుకి పెరిగిపోయింది.
మెడ నొప్పితో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్, టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన శుభ్‌మన్ గిల్, మొదటి బంతికి ఫోర్ కొట్టి రెండో బంతికి అవుటై పెవిలియన్ చేరాడు.
టీ20 ఫార్మాట్‌లో శుబ్మన్ గిల్ కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో జులై 2024లో జింబాబ్వేపై గిల్ హాఫ్ సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌లో ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేకపోయాడు. తన చివరి 16 ఇన్నింగ్స్‌లలో కేవలం ఐదు సార్లు మాత్రమే 30 పరుగుల మార్కును దాటాడు శుబ్మన్ గిల్.
గిల్ ఇలా విఫలమవ్వటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి, గిల్‌కు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ ట్రోల్స్ కి గిల్ ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.