Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ కు సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో చోటు దక్కలేదు. అతడికి బదులుగా యంగ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మను ప్లేయింగ్ 11 లోకి తీసుకున్నాడు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. దాంతో సంజూ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఈ విషయంపై ఇప్పుడు చర్చ మొదలయింది. సంజూను ప్లేయింగ్ 11 నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శుబ్మన్ గిల్ ఓపెనర్ గా ఉండడంతో మిడిలార్డర్‌లోనూ సంజూను ఫిక్స్డ్ ప్లేసులో ఆడలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఏకంగా టీమ్ నుంచే తపించారు.
హెడ్ కోచ్ గంభీర్ కావాలని సంజు శాంసన్ ను టీమ్ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శుబ్మన్ గిల్ ఓపెనర్ గా ఉండడం వల్లే సంజు శాంసన్ కు టీమ్ లో చోటు దక్కడం కష్టమైపోయిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గంభీర్ వల్ల మంచి ప్లేయర్ టీ20 కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.