Shoaib Akthar : బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్న ఐసీసీ రూల్స్ పై షోయబ్ అక్తర్ | ABP Desam
డెసిషన్ రివ్యూ సిస్టం అమలులో ఉండి ఉంటే....సచిన్ టెండూల్కర్ క్రికెట్లో లక్ష పరుగులు పూర్తి చేసేవాడని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అన్నాడు. ఇప్పుడు నిబంధనలన్నీ బ్యాటర్లకు అనుకూలంగా ఐసీసీ మార్చిందన్న అక్తర్....మూడు రివ్యూలు కోరుకుంటూ బ్యాట్స్మన్ ఎక్కువ సేపు క్రీజులో గడుపుతున్నారని అన్నాడు. ఇంతే సాంకేతికత అప్పుడు అందుబాటులో ఉంటే సచిన్ లక్ష పరుగులు పూర్తి చేసేవాడన్న అక్తర్.....తను తన కెరీర్ లో అక్తర్, వసీమ్ అక్రం, మెక్ గ్రాత్, బ్రెట్ లీ లాంటి బౌలర్లను ఎదుర్కొని అన్ని పరుగులు పూర్తి చేశాడన్నాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ సంగతులన్నీ గుర్తు చేసుకున్నాడు రావల్పిండి ఎక్స్ ప్రెస్.