Ind Vs Ban : చేతులెత్తేసిన బంగ్లా పులులు...సెమీస్ లో ఆసీస్ ను ఢీకొట్టనున్న యువభారత్ | ABP Desam
అండర్ 19 వరల్డ్ కప్ లో కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ ను చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేయటం ద్వారా సెమీస్ కు దూసుకెళ్లారు యంగ్ స్టర్స్. తొలుత బ్యాటింగ్ కి దిగి 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది బంగ్లా దేశ్. యంగ్ బౌలర్ రవికుమార్ 7ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయటం ద్వారా బంగ్లాను కట్టడి చేశాడు. తర్వాత 112 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. సెమీస్ లో బలమైన ప్రత్యర్థి ఆసీస్ ను ఢీకొట్టనున్న భారత్...అక్కడా గెలిస్తే ప్రపంచ కప్ కోసం తుదిపోరులో తలపడనుంది.