Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా ప్రభంజనం సృష్టించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ( Shahid Afridi ) టీమ్ ఇండియాపై కామెంట్స్ చేసారు. అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ గెలిచేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. ముఖ్యంగా టీమిండియా కాంబినేషన్ గురించి ప్రస్తావిస్తూ.. "భారత ఫైనల్ టీమ్ లోని 11 మంది ప్లేయర్స్ మాత్రమే కాదు, బెంచ్‌పై ఉన్న వారు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు తుది జట్టులో మార్పులు చేసి, బెంచ్ ప్లేయర్లను దింపినా సరే భారత్ కచ్చితంగా గెలిచేది" అని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ శాంసన్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అలాగే ఫైనల్‌లో అభిషేక్ శర్మ ఆడిన స్పెషల్ ఇన్నింగ్స్‌ను కూడా గుర్తు చేసుకున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. జస్‌ప్రీత్ బుమ్రాను అఫ్రిదీ ఆకాశానికెత్తేశాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా బుమ్రా యార్కర్లకు ప్రత్యర్థి బ్యాటర్ల దగ్గర సమాధానమే లేదని అన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola