BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం

ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకుంది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి, మూడోసారి టీ20 టైటిల్ ను దక్కించుకుంది. ఈ విజయంతో బీసీసీఐ ( BCCI ) ప్లేయర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 131 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. 

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ( BCCI Secretary Devajit Saikia ) ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భారీ మొత్తం కేవలం ప్లేయర్స్ కే కాకుండా కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది అందరికీ అందజేయనున్నారు. గత ఏడాది బార్బడోస్‌లో గెలిచినప్పుడు కూడా 125 కోట్లు ప్రకటించింది బీసీసీఐ. 

ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. చివరికి 96 పరుగుల భారీ తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola