Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
టీమ్ ఇండియా ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 2025 ఏడాదికు అద్భుతంగా వీడ్కోలు పలికాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ తో చెలరేగాడు. ముంబై తరఫున ఆడుతు కేవలం 75 బంతుల్లో 157 పరుగులు చేసాడు.
56 బంతుల్లోనే సెంచరీ బాదిన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాతి 19 బంతుల్లో ఏకంగా 57 పరుగులు సాధించాడు. మొత్తం 75 బంతుల్లో 14 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 157 పరుగులు చేసాడు.
కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్న సర్ఫరాజ్, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. కొన్ని రోజుల క్రితమే సిక్కింపై రోహిత్ శర్మ 62 బంతుల్లో సెంచరీ సాధించి, లిస్ట్-A క్రికెట్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు.
దేశీయ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఈ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్ తోపాటు సెలెక్టర్స్ ను కూడా ఆకర్షిస్తున్నాడు. భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు ముందు తన బ్యాట్ తోనే సెలెక్టర్స్ కు సందేశం పంపాడు సర్ఫరాజ్.