Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీలో ప్లేయర్స్ అందరు రికార్డులు బదులు కొడుతూ.. సెలెక్టర్లను కన్ఫ్యూషన్ లో పడేస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబర్చి టీమ్ ఇండియాకు సెలెక్ట్ కావాలని ప్లేయర్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్.
ఈ విజయ్ హజారే ట్రోఫీలో.. నాలుగు మ్యాచ్‌ల్లోనే 3 సెంచరీలు చేసాడు దేవ్‌దత్ పడిక్కల్. తన సెంచరీతో వన్డే టీమ్ బెర్త్ కు తాను కూడా ఉన్నానంటూ సెలెక్టర్లకు మెసేజ్ ఇచ్చాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 బంతుల్లో 147 పరుగులు బాదాడు. ఇక కేరళపై 137 బంతుల్లో 124 పరుగులు చేసాడు. తమిళనాడుతో 12 బంతుల్లో 22 పురుగులు చేశాడు. ఈ మొత్తం 4 మ్యాచ్‌ల్లో దేవదత్ పడిక్కల్ 405 పరుగులు చేసాడు.
న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పడిక్కల్ సెలెక్ట్ అవుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. క్రికెట్ విశ్లేషకులు ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. మరి న్యూజీలాండ్ సిరీస్ కు పడిక్కల్ సెలెక్ట్ అవుతాడో లేదో చూడాలి.