Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ

Continues below advertisement

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ హీటెడ్ మూమెంట్ క్రికెట్ వర్గాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో హెన్రిచ్ క్లాసెన్ అవుటవ్వడం, ఆ తర్వాత చెన్నై కీపర్ సంజూ శాంసన్‌తో మాటల యుద్ధం జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య చోటుచేసుకున్న ఈ వివాదానికి సంజూ శాంసన్ ఎట్టకేలకు శుభం కార్డు పలికాడు.

క్లాసెన్‌తో జరిగిన వాగ్వాదానికి ముగింపు పలుకుతూ సంజూ శాంసన్ సోషల్ మీడియా వేదికగా ఒక హార్ట్ టచింగ్ పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క్లాసెన్‌తో కలిసి నవ్వుతూ ఉన్న ఒక పాత ఫొటోను షేర్ చేస్తూ.. "గ్రౌండ్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ వ్యక్తిపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి" అంటూ హెన్రిచ్ క్లాసెన్‌ను మెన్షన్ చేశాడు. 

ఇక సంజూ పోస్టుకు క్లాసెన్ కూడా స్పందించాడు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ స్పష్టం చేస్తూ.. "నీపై కూడా నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి మిత్రమా. నువ్వు ఆడే తీరు చూడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. మళ్లీ మైదానంలో నీతో పోటీపడేందుకు ఎదురుచూస్తున్నా" అని అదే ఫొటోను రీ-పోస్ట్ చేశాడు. గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉన్నా, బయట తమ ఫ్రెండ్‌షిప్‌ను కాపాడుకున్న ఈ ఇద్దరి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్‌పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola