Sanju Samson vs Gambhir | కేసీఎల్‌లో పరుగులు సునామీ సృష్టిస్తున్న సంజూ శాంసన్
ఇండియా స్టార్ ప్లేయర్ సంజూ సామ్సన్... కేరళలో తుఫాన్ సృష్టిస్తున్నాడు. ఆసియా కప్‌కు ముందు అతని బ్యాటింగ్ ఫామ్‌తో టీమిండియా కోచ్ గంభీర్‌కి, టీమ్ మేనేజ్‌మెంట్‌కి టెన్షన్ పుట్టిస్తున్నాడు. బ్యాట్‌తో సంజూ సృష్టిస్తున్న సునామీ ఆసియాకప్ ఫైనల్ లెవెన్ గేట్లు బద్దలు కొట్టేలా ఉంది. కేరళ క్రికెట్ లీగ్ (KCL) సీజన్ 2లో సంజూని 26 లక్షల 80 వేలకి కోచి బ్లూ టైగర్స్ కొనుక్కుంది. ఇది మొత్తం టోర్నీలోనే అత్యధిక ధర. అంత నమ్మకంతో తనని కొనుక్కున్నందుకే సంజూ సామ్సన్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. రీసెంట్‌గా కొల్లాం సెయిలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే సంజూ సామ్సన్ తన KCL కెరీర్‌లో ఫష్ట్ సెంచరీ కూడా బాదేశాడు. ఇదొక్కటే కాదు.. మొత్తం టోర్నమెంట్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో సంజూ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 73 యావరేజ్‌తో, 187 స్ట్రైక్ రేట్‌తో.. 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 368 రన్స్ చేశాడు. అందులో హయ్యస్ట్ స్కోర్ 121. దీంతో ఇప్పటివరకు ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఉంటారని, సంజూని బెంచ్‌కే పరిమితం చేస్తారని బాధపడుతున్న ఫ్యాన్స్‌కి పెద్ద బూస్ట్ దొరికినట్లైంది. ఆసియా కప్ స్క్వాడ్‌లో ఉన్న సంజూ, ఈ పెర్ఫార్మెన్స్‌తో టీమ్ ఇండియా ఓపెనింగ్ పొజిషన్‌కి నెంబర్ వన్ కంటెండర్‌గా మారాడు. ‘ఎవడ్రా మనల్నాపేది?’ అనే రేంజ్‌లో అటు యంగ్ ప్లేయర్లనే ఫైనల్ 11లో ఆడించాలనుకుంటున్న గంభీర్‌కి, ఇటు గిల్, అభిషేక్ జోడీ బాగుంటుందనుకుంటున్న టీమ్ మేనేజ్‌మెంట్‌కి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు. ఇప్పుడు సంజూను ఫైనల్ 11లో సెలక్ట్ చేయకుండా ఉండటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక ఈ రోజు మంగళవారం క్యాలికట్ గ్లోబ్‌స్టార్స్‌తో తన కేసీఎల్ లాస్ట్ మ్యాచ్ ఆడి.. బుధవారం ఆసియా కప్ కోసం దుబాయ్ బయలుదేరి వెళ్లబోతున్నాడు. మరి ఈ రకంగా ఇరగదీసిన తర్వాత కూడా సంజూని బెంచ్‌కే పరిమితం చేసే ధైర్యం టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తుందా? అలాగే కేసీఎల్ ఫామ్‌ని సంజూ ఆసియా కప్‌లో కూడా కంటిన్యూ చేయగలడా? మీ ఒపీనియన్ ఏంటి?