Loss to BCCI | కేంద్రం డెసిషన్‌తో ఇండియన్ క్రికెట్‌కి 7వేల కోట్ల నష్టం
ఇండియన్ క్రికెట్ ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఏటా లక్షల కోట్ల రూపాయల సంపాదించుకునే బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక అనెక్స్‌పెక్టెడ్ డెసిషన్‌తో ఒక్కసారిగా వేల కోట్లు నష్టపోబోతోంది. గత కొన్నేళ్లుగా, ఇండియన్ క్రికెట్‌కి ఫాంటసీ స్పోర్ట్స్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. Dream11, My11Circle లాంటి కంపెనీలు BCCI, ఐపీఎల్, ఇంకా క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం చేసే ఛానెల్స్‌కి వేల కోట్లు స్పాన్సర్‌షిప్ రూపంలో ఇచ్చేవి. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం యాడ్స్ కోసం ఈ గేమింగ్ కంపెనీలు దాదాపు ₹7,000 కోట్లకి పైగా ఖర్చు చేసేవి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ చట్టంతో ఈ గేమింగ్ అన్నీ బ్యాన్ అయిపోయాయి. ఈ ఒక్క నిర్ణయంతో భారత క్రికెట్ ఫైనాన్షియల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉన్న Dream11, ₹358 కోట్ల డీల్‌ను మధ్యలోనే ఆపేసింది. దీంతో ఇంకొద్ది రోజుల్లో జరగబోయే ఆసియాకప్ టోర్నీలో ఇండియన్ టీమ్ స్పాన్సర్ లేకుండానే ఆడాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇంకో ఫాంటసీ గేమింగ్ యాప్.. My11Circle కూడా ఐపీఎల్‌తో ఉన్న ₹625 కోట్ల ఒప్పందం రద్దు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఐపీఎల్ ఫ్రాంచైజీలను కూడా భయపెడుతోంది. ఎందుకంటే, ఆయా జట్లు కూడా ఫాంటసీ గేమింగ్ కంపెనీలతో చాలా పెద్ద ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ దెబ్బ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాలేదు. మ్యాచ్‌లను ప్రసారం చేసే ఛానెల్స్, OTT ప్లాట్‌ఫామ్స్, ఇంకా గూగుల్, మెటా లాంటి డిజిటల్ దిగ్గజాలు కూడా భారీగా ఆదాయాన్ని కోల్పోబోతున్నాయి. ఎందుకంటే, స్పోర్ట్స్ యాడ్స్‌లో ఈ గేమింగ్ కంపెనీల వాటా చాలా పెద్దది.ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ వేల కోట్ల నష్టాన్ని మన ఇండియన్ క్రికెట్ అండ్ అలాగే ఈ కంపెనీలు భరించగలవా? ఇది జస్ట్ క్రికెట్ సంక్షోభం మాత్రమే కాదు, ఇండియన్ అడ్వర్టైజింగ్ రంగాన్నే కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం. మరి ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి BCCI ఇంకా క్రికెట్ ఫ్రాంచైజీలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాయో.. కంపెనీలు ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తాయో చూడాలి. మరి మీరేం అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఈ చట్టంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.