Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై అఘా స్పందిస్తూ.. "ప్రస్తుత క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తి చచ్చిపోయింది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. బౌలర్ హసన్ మిరాజ్‌ అఘాను అవుట్ చేసిన విధానం గురించి తెలిసిందే. కోపంతో ఊగిపోయిన అఘా.. బంగ్లా ప్లేయర్లతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, మైదానం వీడుతూ తన బ్యాట్, గ్లౌజులను నేలకు కొట్టాడు. దాంతో ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకుంది. డిమెరిట్ పాయింట్ ని కూడా చేర్చింది. 

సల్మాన్ అలీ అఘా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నిబంధనల ప్రకారం నేను అవుట్ కావచ్చు, కానీ మానవీయ కోణంలో అది తప్పు. నేనైతే అలాంటి సమయంలో క్రీడా స్ఫూర్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడిని. పాకిస్థాన్ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola