భారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

SA vs IND 4th T20I Highlights: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సీనియర్లతో కూడిన భారత టెస్టు టీమ్ ఘోర పరాభవం తర్వాత.. ఇప్పుడు యంగ్ ఇండియన్ టీ20 టీమ్ సౌత్ ఆఫ్రికాలో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్ ఆఫ్రికా టీమ్‌ని సొంత గడ్డపైనే వారిని మట్టికరిపించి నాలుగు టీ20ల సిరీస్‌ను 3-1తో ఇండియా కైవసం చేసుకుంది. దీంట్లో తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ పోటీలు పడి మరీ సెంచరీలు బాదేయడంతో సిరీస్‌ చివరి మ్యాచ్‌లో భారత జట్టు 135 పరుగులతో పెద్ద విజయం సాధించింది. తిలక్, సంజులకు తోడు అభిషేక్‌ శర్మ కూడా తోడయ్యాడు. దీంతో ఫోర్త్ టీ20లో భారత్‌ వికెట్‌ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, హార్దిక్‌ పాండ్య కూడా విజ్రుంభించడంతో ఇక సౌతాఫ్రికా టీమ్ విలవిలలాడింది. 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఓడిపోయింది. ట్రిస్టియన్‌ స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, యాన్సెన్‌ మాత్రమే కాస్త ప్రతిభ కనబర్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola