మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు
19ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మైక్ టైసన్ ను చిత్తుగా ఓడించాడు యువ బాక్సర్ జేక్ పాల్. నెట్ ఫ్లిక్స్ ప్రత్యక్షప్రసారం చేసిన ఈ ఆసక్తికర మ్యాచ్ లో జేక్ పాల్ చేతిలో మైక్ టైసన్ 79-73 తేడాతో ఓడిపోయాడు. టెక్సాస్ లోని ఆర్లింగ్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ కోసం 58ఏళ్ల మైక్ టైసన్ మళ్లీ రింగ్ లోకి అడుగుపెట్టాడు. 1987 నుంచి 1990వరకూ వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంఫియన్ గా ఉన్న టైసన్..కెరీర్ లో 59 బౌట్స్ లో 50 గెలిచాడు. అందులో 44 మంది సార్లు ప్రత్యర్థులను నాకౌట్ చేసి పారేసి బాక్సింగ్ చరిత్రలో ఓ లెజెండ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యూట్యూబర్ కమ్ బాక్సర్ అయిన జేక్ పాల్ పొగరు అణుస్తానంటూ లేటు వయస్సులో బరిలోకి దిగి చిత్తుగా ఓడిపోయాడు. జేక్ పాల్ టైసన్ ను ఓడించిన తర్వాత తన వినయాన్ని చాటుకున్నాడు. మ్యాచ్ కు ముందు తనను చెంప మీద కొట్టిన మైక్ టైసన్ ను మ్యాచ్ లో ఓడించి మీరొక లెజెండ్ మీతో మ్యాచ్ ఆడటాన్ని మిమ్మల్ని ఓడించాననే విషయాన్ని జీవితాంతం చెప్పుకుంటూ అంటూ టైసన్ కే ఈ విజయాన్ని ట్రిబ్యూట్ ఇచ్చాడు. మైక్ టైసన్ ను ఓడించటం ద్వారా ఈ జేక్ పాల్ 300 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.