RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

Continues below advertisement

లీగ్ స్టేజ్ లో గెలుపు ఓటములతో సతమతమవుతూ.. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ను 30 పరుగుల తేడాతో చిత్తు చేసి టేబుల్ లో 4th ప్లేస్ కు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించడం, అలాగే బౌలింగ్‌లో కూడా అతనికి ముందే ఛాన్స్ ఇవ్వడం వెనుక ఉన్న రహస్యాన్ని పరాగ్ బయటపెట్టాడు. పిచ్ కండిషన్స్ బట్టి దూకుడుగా ఆడే బ్యాటర్ అవసరం కావడంతోనే ఆర్చర్‌ను ముందుకు పంపానని స్పష్టం చేశాడు. 

అయితే అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం ఏంటంటే.. తాను పూర్తిగా ఫిట్‌గా లేనని పరాగ్ ప్రకటించాడు. కేవలం మెంటల్ ఫిట్ నెస్ తోనే ఈ మ్యాచ్ ఆడానని, ప్లేఆఫ్స్ కూడా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. నిజానికి తాము చాలా ముందే ప్లేఆఫ్స్ చేరాల్సిందని, కొన్ని తప్పుల వల్ల ఆలస్యమైందని చెప్తూ..ప్లేఆఫ్స్‌లో మరింత స్ట్రాంగ్‌గా కంబ్యాక్ ఇస్తామని అన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola