RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ

Continues below advertisement

ఐపీఎల్‌లో మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కి టైం అయింది. ఫైనల్ బర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. యంగ్ ప్లేయర్స్ తో రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ పై విధ్వంశం సృష్టించింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఫామ్‌తో బ్యాటింగ్ లైన్ అప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక బౌలింగ్‌లో బోల్ట్ పవర్‌ప్లే వికెట్స్ తీస్తూ బ్యాట్స్మన్ ను వణికిస్తున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్‌లపైనే మొత్తం భారం వేసింది. గుజరాత్ మిడిలార్డర్ క్లిక్ అయితేనే RR బౌలింగ్‌ను తట్టుకోగలరు.

న్యూ చండీగఢ్ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ ట్రాక్. టాస్ గెలిచిన టీమ్ ఖచ్చితంగా చేజింగ్ వైపే మొగ్గు చూపుతుంది. పవర్‌ప్లేలో వచ్చే పరుగులే ఇరు జట్ల గెలుపును డిసైడ్ చేయబోయే అవకాశం ఉంది. 

కరెంట్ ఫామ్ చుస్తే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా నే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా తమని తాము ఈ రెండు టీమ్స్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాయి. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? RR గెలుస్తుందా లేక GT షాక్ ఇస్తుందా? కింద కామెంట్ చేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola