Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

Continues below advertisement

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వెంటనే ఆ జట్టును వీడాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన సూచన చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నీడలో జైస్వాల్ కొనసాగడం అతని కెరీర్‌కు అస్సలు మంచిది కాదని, వీలైనంత త్వరగా అతను టీమ్ మారాలని రాయుడు హితవు పలికాడు.

జైస్వాల్ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్‌లో ఓపెనర్‌గా ఉన్నాడు. కానీ ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 15 మ్యాచ్‌ల్లో 680 పరుగులతో టాప్ స్కోరర్‌గా దూసుకుపోతుంటే, జైస్వాల్ మాత్రం 426 పరుగులతో కాస్త నిలకడ కోల్పోయాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో జైస్వాల్ 29 బంతుల్లో 29 పరుగులే చేసి తీవ్రంగా తడబడ్డాడు. 

అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించి వన్-మ్యాన్ షోతో మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. ఓవైపు వైభవ్ చెలరేగుతుంటే జైస్వాల్ కేవలం స్ట్రైక్ రొటేట్ చేయడానికే పరిమితమయ్యాడు. "యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా టీమ్ ను మార్చుకోవాలి. అతను ఒక స్టార్. సూర్యవంశీ లాంటి డామినేటింగ్ ప్లేయర్ పక్కన ఉంటే జైస్వాల్ తన పూర్తి సామర్థ్యాన్ని చూపించలేడు. జైస్వాల్ గనుక వేలంలోకి వస్తే ముంబై ఇండియన్స్ అతనికి పర్‌ఫెక్ట్ ఆప్షన్. రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉన్నాడు కాబట్టి, ముంబైలో జైస్వాల్ ఒంటరిగా మ్యాచ్‌లు గెలిపించగలడు" అని చెప్పుకొచ్చాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola