Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ ప్లేయర్స్ మ్యాచ్‌పై కనీస అవగాహన లేకుండా ఆడారని మండిపడ్డాడు.
అశ్విన్ మాట్లాడుతూ.. "ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. అతనికి ఏమైనా గాయం సమస్య ఉందా? SRH మేనేజ్‌మెంట్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం అస్సలు బాలేదు. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అవగాహన లోపంతో ఆడి అనవసరమైన రిస్క్ తీసుకున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్ మినహా రాజస్థాన్ బౌలింగ్‌లో అంత పవర్ లేదు. మైదానంలో లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు రవీంద్ర జడేజా, యశ్ రాజ్ బౌలింగ్‌కు రారు అనే సింపుల్ లాజిక్‌ను కూడా సన్‌రైజర్స్ గ్రహించలేకపోయింది" అంటూ విశ్లేషించాడు.
"15వ ఓవర్ వరకు కూడా సన్‌రైజర్స్ మ్యాచ్‌లోనే ఉంది. కానీ తమ ముందు ఉన్న పరిస్థితి ఏంటో వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఈ సీజన్‌లో SRH ఇలాంటి తప్పులు చాలాసార్లు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన డే గేమ్‌లో వికెట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మంచి స్టార్ట్ లభించినప్పటికీ ఘోరంగా కుప్పకూలారు. కేవలం చెత్త షాట్స్ ఆడి వికెట్లు పారేసుకున్నారు" అని అశ్విన్ అన్నాడు.