RR Exchange for Trading Sanju Samson | CSK తో RR డీల్ ?

Continues below advertisement

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టీం ను విడుడుతున్నాడన్న వార్తలు జోరందుకున్నాయి. అయితే సంజును ట్రేడింగ్ చేస్తారా లేదా మినీ వేలంలోకి వస్తాడా అన్న డౌట్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇలాంటి టైం లో మరో వార్త తెరపైకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ వేరే టీమ్స్ తో చర్చలు జరుపుతున్నారట. సంజూకు బదులుగ తమకు ఫలానా ప్లేయర్ కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. డీల్ కుదిరితే 2026 ఐపీఎల్ మినీ వేలంలోకి సంజు శాంసన్ వచ్చే ఛాన్స్ లేదు. 

అయితే రాజస్థాన్ రాయల్స్‌.. చెన్నై సూపర్ కింగ్స్ తో డీల్ కుదర్చడానికి ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంజు శాంసన్ కు బదులుగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీందర్ జడేజా లేదా రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేను అడిగారట. ఈ ముగ్గురు కూడా CSK లో కీలక ప్లేయర్స్. దాంతో ఈ ఆఫర్ తో CSK ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే CSK సంజుపై ఆసక్తి చూపిస్తుంది. కానీ RR అడిగిన ప్లేయర్స్ ను ఎక్స్చేంజ్ చేయడానికి ఇష్టపడడం లేదట. 

RR వేరే టీమ్స్ తో ఎక్స్చేంజ్ చేస్తే సంజు ఆ టీంలోకి వెళ్ళిపోతాడు. ఒక వేల ఏ టీంతోను డీల్ ఫీల్ అవకపోతే సంజు వేలంలోకి వస్తాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే RR తో సంజూ 2027 వరకు ఒప్పందం చేసుకున్నాడు. సంజు శాంసన్ 2026 మినీ వేలంలోకి వస్తే మాత్రం CSK అతని దక్కటిచ్చుకోవటంలో ఎలాంటి సందేహం లేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola