Cricketer Nitish Reddy at Athadu Re - Release | అతడు సినిమా చూసిన స్టార్ క్రికెటర్
తెలుగు రాష్ట్రలో రీ రిలీజ్ సందడి మాములుగా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ అయిన అతడు సినిమా రికార్డులను తిరగరాస్తుంది. అతడు సినిమాని థియేటర్స్ లో చూస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ లిస్ట్ లోకి ఒక స్టార్ క్రికెటర్ కూడా చేరిపొయ్యాడు. అతను ఎవరో కాదు క్రికెటర్ నితీష్ రెడ్డి.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాను చాలా పెద్ద ఫ్యాన్ అంటూ నితీష్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రమోషన్స్‌లలో కూడా మహేష్ బాబు డైలాగ్స్ చెప్పి అందర్నీ అలరించాడు. అతడు రీ రిలీజ్ సందర్భగా నితీష్ కూడా తన ఫేవరేట్ హీరో సినిమాని థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేసాడు. ఇందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. What my week looked like... అంటూ తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోలతో పాటు, తన కొత్త టాటూ ఫొటోస్ ని కూడా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు నితీష్ రెడ్డి.