Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్

Continues below advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026లో పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఉజ్బెకిస్తాన్‌పై ట్విన్ గోల్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన రొనాల్డో.. ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. కొలంబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు రొనాల్డో సరికొత్త ‘గోల్డెన్ కలర్’ షూస్ ధరించి ట్రైనింగ్ సెషన్‌లో కనిపించి అందరి అటెన్షన్ క్యాచ్ చేశాడు.

వరుసగా ఆరు వేర్వేరు ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ కొట్టిన ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన రికార్డుకు గౌరవంగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ నైకీ రొనాల్డో కోసం ప్రత్యేకంగా 'గోల్డ్ స్కార్పియన్ మెర్క్యురియల్ సూపర్‌ఫ్లై 11' షూస్‌ను డిజైన్ చేసింది. ఈ లగ్జరీ షూస్‌పై రొనాల్డో అఫీషియల్ మోనికర్ 'CR7' అని వైట్ కలర్‌లో ప్రింట్ చేశారు.

ఉజ్బెకిస్తాన్‌ను 5-0 తో చిత్తు చేసిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ కొట్టి, పోర్చుగల్ వరల్డ్ కప్ హిస్టరీలోనే 10 గోల్స్‌తో హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా పోర్చుగల్ లెజెండ్ యుసేబియో పేరిట ఉన్న 9 గోల్స్ రికార్డును బ్రేక్ చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola