Romario Shepherd 22 Runs in One Ball | ఒక్క బాల్ కి 22 పరుగులు చేసిన RCB ప్లేయర్

Continues below advertisement

వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌.. ఆర్సీబీ ప్లేయర్ రొమారియో షెఫర్డ్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. తన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. సీపీఎల్ లో భాగంగా గయానా అమెజాన్‌ వారియర్స్‌, సెయింట్‌ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అమెజాన్‌ వారియర్స్‌ తరపున బరిలోకి దిగన రొమారియో షెఫర్డ్‌ ఒక బాల్ లో ఏకంగా 22 పరుగులు తీసాడు. 

మ్యాచ్‌లో 15వ ఓవర్‌ నడుస్తున్న టైం లో అల్జారీ థామస్ బౌలింగ్ చేస్తున్నాడు. థామస్‌ ఒక నో-బాల్ వేసాడు. నో బాల్ కాబట్టి షెఫర్డ్‌ కూడా రన్స్ తీయలేదు. తర్వాత వేసిన ఫ్రీ-హిట్ వైడ్‌గా వెళ్లింది. ఆ నెక్స్ట్ వేసిన బాల్ ను షెఫర్డ్‌ సిక్స్‌ కొట్టాడు. కానీ అది కూడా నోబాల్‌. ఆ నెక్స్ట్ థామస్ బాల్ వేస్తె మళ్ళి వైడ్ అయింది. వైడ్ కాబట్టి మరో రన్ వచ్చింది. ఇక చేసేదేమి లేక థామస్ బాల్ వేసాడు. దురదృష్టవశాతూ షెఫర్డ్‌ దాని బౌండరీ కొట్టాడు. కానీ అది కూడా నో-బాల్‌ అయ్యింది. మళ్ళి ఫ్రీ-హిట్ వచ్చింది. ఆ బాల్ ను షెపర్డ్‌ సిక్స్‌గా మలిచాడు. నెక్స్ట్ బాల్ ను కూడా షెఫర్డ్ స్టాండ్స్‌లోకి పంపించాడు. వరుసగా మూడో సిక్స్‌ లు కొట్టాడు. మొత్తం వైడ్, షెఫర్డ్ కొట్టిన రన్స్ కలిపి ఒకే ఒక బాల్ కు 22 పరుగులు వచ్చాయి. దాంతో షెఫర్డ్‌ 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola