Mohammed Shami about Retirement | రిటైర్మెంట్ పై స్పందించిన షమీ

టీమిండియాలో ఎవరు ఊహించని విధంగా ఒకరి తర్వాత మరొకరు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ టీ20.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. అశ్విన్, పుజారా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఐపీఎల్ కూడా ఆడనని చెప్పేసారు అశ్విన్. అయితే ఆసియా కప్ లో సెలెక్ట్ అవకపోవడంతో పేసర్ మొహమ్మద్ షమీ కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. తన రిటైర్మెంట్ ప్లాన్స్ పై స్పందించాడు మొహమ్మద్ షమీ. సరైన టైమ్‌లోనే నేను రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని అంటున్నాడు. 

గేమ్ ను ఎంజాయ్ చేస్తునంత కాలం తాను ఏ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించనని షమీ అంటున్నాడు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. గేమ్ అంటే తనకు విసుగు వచ్చిన రోజు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని చెప్పేసాడు. నేను రిటైర్మెంట్ తీసుకుంటే వేరే వాళ్ళ జీవితాలు బాగుపడతాయా ? నేను ఎవరి జీవితానికి అడ్డుగా ఉన్నాను.. నేను రిటైర్ కావాలని మీరు అనుకుంటున్నారా ? నాకు విసుగు వచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను. మీరు నన్ను సెలెక్ట్‌ చేయకపోయినా కూడా నేను ఆడుతూనే ఉంటా. ఇంటర్నేషనల్ లో ఛాన్స్ రాకపోతే దేశవాళీ క్రికెట్‌ ఆడుతా. అక్కడ కాకపోయినా కూడా ఎదో ఒక చోట నేను ఖచ్చితంగా క్రికెట్ ఆడుతూనే ఉంటానంటూ... తన మాటలతో అందరికి షమీ షాక్ ఇచ్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola