Rohit Sharma vs Virat Kohli Opening | T20 World Cup 2024 | ఓపెనర్స్ గా రోహిత్-విరాట్ హిట్టు కొడతారా?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో పాటు కోహ్లీ ఓపెనర్ గా పంపించే టీం ఇండియాకు ప్లస్ అవుతుంది చాలా రోజులుగా అందరు అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఐర్లాండ్ తో మ్యాచుల్లో వీరిద్దరు ఓపెనర్లుగా వచ్చారు. కోహ్లీ త్వరగానే ఔటైనప్పటికీ... రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించారు. కోహ్లీ ఓపెనర్ గా రావడం వల్ల ప్లేయింగ్ 11లో శివమ్ దూబెకు చోటు దక్కింది. అతనితో పాటు హార్దిక్, అక్షర్, జడేజా రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. దీంతో బౌలింగ్, బ్యాటింగ్‌లో కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఓపెనర్‌గా కోహ్లి 741 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా కోహ్లి 9 మ్యాచ్‌ల్లో 161.29 స్ట్రైక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. కానీ, ఇలా కాకుండా పెద్దగా ఫామ్ లో లేని యశస్వీ జైస్వాల్ ని ఓపెనర్ గా పంపిస్తే ..కోహ్లీ వన్ డౌన్ లో రావాల్సి ఉంటుంది. అప్పుడు శివవ్ దూబే లేదా ఇంకా ఎవరైనా ఆల్ రౌండర్ ను కూర్చొబెట్టాల్సి వస్తుంది. దీని వల్ల జట్టుకు మైనస్. అందుకే ఫామ్ లో ఉన్న కోహ్లీని ఓపెనింగ్ పంపిస్తే బ్యాటింగ్ లో దూకుడుతో పాటు.. ఆల్ రౌండర్స్ వల్ల బ్యాటింగ్, బౌలింగ్ లోతు కూడా పెరుగుతుంది.