Rohit Sharma 52 Runs | India vs Ireland Highlights | వరల్డ్ కప్పుల్లో మొనగాడు రోహిత్ శర్మ

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భారత్ బోణీ కొట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో భారత్ బోణీ కొట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. టార్గెట్ 97 ఉన్నప్పటికీ.. మనోడు హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 37 బాల్స్ లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు.రోహిత్ శర్మ మొన్న జరిగిన ఐపీఎల్ లో 14 మ్యాచుల్లో 417 పరుగులే కొట్టాడు. అంతగా టచ్ లో కనిపించలేదు. వరల్ కప్ లో మంచి టచ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. 52 పరుగులు కొట్టిన తరువాత కూడా ఔట్ కాకుండా... వెన్నునొప్పి కారణంలో రిటైర్డ్ హార్ట్ అయ్యారు. ఇప్పుడనే కాదు.. రోహిత్ శర్మ ఎప్పుడు కూడా వరల్డ్ కప్ లో హిట్టే. 2007 నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ లో 37 ఇన్నింగ్సులు ఆడిన రోహిత్ ...వెయ్యికిపైగా పరుగులు చేశాడు. అందులో పది హాఫ్ సెంచరీలు..ఒక సెంచరీ ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ లోనూ అంతే.. ఆడిన 28 ఇన్నింగ్సుల్లో 1575 పరుగులు కొట్టాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ చరిత్రలో 7 సెంచరీలు కొట్టిన మరో మొనగాడు లేడు తెలుసా..! అట్లుంటది మరి రోహిత్ తోని. సో.. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ లో రోహిత్ విఫలమవ్వొచ్చు గానీ... వరల్డ్ కప్ప్పుల్లో మాత్రం దీటుగా ఆడతాడని ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola