Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్

Continues below advertisement

ఇండియా న్యూజీలాండ్ ( India vs New Zealand ) మధ్య జరిగిన తోలి వన్డే మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఒక సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.

301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది భారత్. ఎప్పటి లాగానే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కూడా ఓపెనింగ్ కు వచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ .. ఆ తర్వాత చెలరేగాడు. ఆరో ఓవర్‌లో బెన్ ఫౌల్క్స్ బౌలింగ్‌లో తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కైల్ జేమిసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్ ను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ సిక్సర్‌తో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. 

ఈ మ్యాచ్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. దాంతో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ( Chris Gayle ) 328 సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ అద్భుతమైన ఫార్మ్ లో కొనసాగుతున్నాడు. ఆడుతున్నది ఒకే ఫార్మాట్ అయినప్పటికీ.. రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola