Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

Continues below advertisement

విజయ్ హజారే ట్రోఫీలో ( Vijay Hazare Trophy ) ప్లేయర్స్ అందరు చెలరేగిపోతున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి బ్యాట్స్మన్ రికార్డుల మోత మోగిస్తున్నారు. తమను తాము నిరూపించుకోవడానికి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి ప్లేయర్స్ బాగానే కష్టపడుతున్నారు. అయితే ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. 

విజయ్ హజారే రొఫీలో రెండు సీజన్‌లలో 700 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు దేవదత్ పడిక్కల్. ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 95 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్ లో 721 పరుగులు చేసాడు పడిక్కల్. దాంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

2020-21 సీజన్‌లో కూడా పడిక్కల్ 7 మ్యాచ్‌లలో 737 పరుగులు చేశాడు. ఇప్పుడు రెండో సీజన్‌లోను 700 పరుగులు చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. అలా సెలెక్టర్లకు తన బ్యాటింగ్ తోనే హింట్ ఇస్తున్నాడు పడిక్కల్

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola