రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
విరాట్ కోహ్లీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరిది. క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించి.. క్రికెట్ గాడ్ సచిన్ తర్వాత అంతటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రన్ మెషీన్ మనోడు. ప్రెజర్‌లో ఉన్నా.. అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నా.. 100 పర్సెంట్ కాన్ఫిడెన్స్‌తో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చే ఫైటింగ్ స్పిరిట్ విరాట్ సొంతం. అందుకేనేమో విరాట్ అంటే కోట్ల మంది ఫ్యాన్స్‌కి అంత పిచ్చి ఇండియాలో. మరి అలాంటి విరాట్ బర్త్ డే ఈ రోజు.
37 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాళ్లకంటే యంగ్‌గా, మోర్ ఫిట్‌గా ఉండటమే కాదు.. గ్రౌండ్‌లో చిరుతలా కదులుతూ స్టన్నింగ్ క్యాచ్‌లతో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటాడు. రీసెంట్‌గా ఆసీస్‌తో మ్యాచ్‌లో మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్‌ని మిల్లీ సెకండ్ల గ్యాప్‌లో పట్టాడమే దీనికి పెద్ద ప్రూఫ్. ఇక కెరీర్లో విరాట్ సాధించిన రికార్డులు ఒకటా? రెండా? క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్ రికార్డ్‌నే బద్దలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్.
ఇంటర్నేషనల్ క్రికెట్లో 27.673 రన్స్‌తో సచిన్, సంగర్కర్ తర్వాత టాప్3లో ఉన్నాడు. ఇంకో 343 రన్స్ కొడితే.. సంగర్కర 28,016 రన్స్‌ని దాటి టాప్2 ప్లేస్ సొంతం చేసుకుంటాడు. దానికి పక్కా ఛాన్స్ కూడా ఉంది. అయితే వన్డేల్లో మాత్రం 14,255 రన్స్‌తో సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్ తర్వాత.. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఛేజింగ్ అంటే కోహ్లీకి పూనకాలే. అందుకే వన్డేల్లో ఛేజింగ్ టైంలో 89.29 యావరేజ్‌తో 6000 రన్స్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.