RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూపీ వారియర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. తొమ్మిది వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్ దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్ రాణించారు. 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది. అప్పుడు వచ్చిన దీప్తి శర్మ, డాటిన్ చివరి వరకు క్రీజులో ఉండి 143 పరుగులు చేసారు.
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB కేవలం 12.1 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్లు గ్రేస్ హారిస్, స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్ చేశారు. గ్రేస్ హారిస్ 40 బంతుల్లో 85 పరుగులు చేసింది. స్మృతి మంధాన కూడా రాణించడంతో కేవలం ఒకే వికెట్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.