RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక హిస్టారికల్ విన్నింగ్ గేమ్ కు వేదిక అయింది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో టిమ్ డేవిడ్, కెప్టెన్ రజత్ పటిదార్ సృష్టించిన విధ్వంసం సూపర్ అనే చెప్పాలి. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలో ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ మంచి స్టార్ట్ ని ఇచ్చారు. దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, అసలు ఆట ఆఖరి ఐదు ఓవర్లలో మొదలైంది. టిమ్ డేవిడ్, రజత్ పటిదార్ జంట డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 30 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టారు. ఇందులో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పటిదార్ 48 పరుగులు చేసాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.

251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు మొదట్లోనే షాక్ తగిలింది. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే తక్కువ పరుగులకే వెనుదిరగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola