IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో

సొంత‌గ‌డ్డ‌పై ఆడిన తొలి మ్యాచ్ లోనే సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓటమి పాలయింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్.. బ్యాట‌ర్ల వైఫ‌ల్యంతో 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 156 ప‌రుగులు చేసింది.

హెన్రిచ్ క్లాసెన్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. లక్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్రిన్స్ యాద‌వ్, అవేశ్ ఖాన్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను ల‌క్నో సునాయ‌సంగానే ఛేదించింది. 19.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 160 ప‌రుగులు చేసి ఈజీ విక్ట‌రీని అందుకుంది. రిష‌భ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ల‌లో హ‌ర్ష్ దూబేకు రెండు వికెట్లు ద‌క్కాయి. 

కాస్త ఈజీ టార్గెట్ తోనే బ‌రిలోకి దిగిన ల‌క్నోకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. రెండు బౌండ‌రీల‌తో జోరు చూపించిన మిషెల్ మార్ష్ ను ఇషాన్ మ‌లింగ పెవిలియ‌న్ కు చేర్చాడు. ఈ ద‌శ‌లో ఐడెన్ మార్క్ర‌మ్ తో క‌లిసి పంత్ జ‌ట్టును ముందుండి నడిపించాడు. ఒక ఎండ్ లో మార్క్ర‌మ్ దూకుడుగా ఆడ‌గా, పంత్ అత‌నికి స‌హాకారం అందించాడు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో ల‌క్నో 53 ప‌రుగులు సాధించింది. మార్క్ర‌మ్ వెనుదిరిగినా పంత్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఆఖరిలో అబ్దుల్ స‌మ‌ద్ కీల‌క ప‌రుగులు జ‌త చేసి, జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola