క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన బౌలర్ అశ్విన్ రవిచంద్రన్

Continues below advertisement

బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. గబ్బా టెస్ట్‌లో రెయిన్ బ్రేక్ వచ్చిన సమయంలో డ్రెసింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో చాలా సేపు మాట్లాడుతూ కనిపించాడు అశ్విన్. ఆ తరవాత కోహ్లీని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. థర్డ్ టెస్ట్‌లో అశ్విన్ ఆడలేదు. అతనికి బదులుగా స్పిన్నర్ రవీంద్ర జడేజాని తీసుకున్నారు. ఈ టూర్ మొత్తంలో అశ్విన్ కేవలం ఒకటే టెస్ట్ ఆడాడు. అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో ఒక వికెట్ తీసిన అశ్విన్..53 పరుగులు ఇచ్చాడు. అయితే...కోహ్లీతో ఇంత సేపు మాట్లాడడం, ఆ తరవాత హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ తరవాత హెడ్ కోట్ గౌతమ్ గంభీర్‌తోనూ అశ్విన్ మాట్లాడాడు. రిటైర్ అవుతున్నాడు కాబట్టే అంత ఎమోషనల్ అయ్యుంటాడని అప్పటికే ప్రచారం మొదలైంది. ఆ తరవాత దీనిపై అఫీషియల్‌గా రిటైర్‌ అవుతున్నట్టు స్టేట్‌మెంట్ వచ్చింది. ఇక అశ్విన్ రికార్డుల విషయానికొస్తే...టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 14 ఏళ్ల కెరీర్‌లో 106 టెస్ట్‌లలో ఆడాడు అశ్విన్. చివరిగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన అడిలైడ్ టెస్ట్‌లో ఆడాడు. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో మొత్తం 537 వికెట్లు తీశాడు. టెస్ట్‌లతో పాటు 116 వన్‌డే మ్యాచ్‌లు, 65 టీ 20లు ఆడాడు. వన్‌డే మ్యాచ్‌లలో 156 వికెట్లు తీసిన అశ్విన్...టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. రిటైర్ అయ్యే టైమ్‌కి అశ్విన్ మరో రికార్డునీ తన సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధికంగా 268 మంది లెఫ్ట్ హ్యాండర్స్‌ని పెవీలియన్‌కి పంపాడు. బ్యాటింగ్ విషయానికొస్తే...టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేశాడు. వీటిలో ఆరు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram