అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

Continues below advertisement

ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. గబ్బా టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే తన రిటైర్‌మెంట్‌పై డిసిషన్ తీసుకున్నాడు అశ్విన్. ఈ స్టేట్‌మెంట్ వచ్చే ముందు చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. అయితే...ఈ సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు రోహిత్ శర్మ వెల్లడించాడు. అశ్విన్ డిసిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తామని అన్నాడు. అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాడనీ అన్నాడు. అసలు బార్డర్ గవాస్కర్ సిరీస్ మొదట్లోనే తనతో చెప్పాడనీ వివరించాడు. నిజానికి...అడిలైడ్ టెస్ట్‌కి ముందే ఈ నిర్ణయం ప్రకటించే వాడే. కానీ..తాను కన్విన్స్ చేయడం వల్లే ఆగాడని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. దీనిపై ఇద్దరి మధ్యా డిస్కషన్ జరిగినట్టూ చెప్పాడు. అయితే...అశ్విన్ అసహనంతోనే ఈ డిసిషన్ తీసుకున్నాడని మాత్రం అర్థమవుతోంది. తన అవసరం లేనప్పుడు ఉండి మాత్రం ఎందుకు అని చాలా డిస్పరేటెడ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అవసరం లేనప్పుడు రిటైర్‌మెంట్ ఇచ్చేస్తానని ముందుగానే చెప్పాడని రోహిత్ శర్మ కూడా చెప్పాడు. పైగా..బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆడే అవకాశం కూడా లేకపోవడం వల్ల ఇక లేట్ చేయడమెందుకని డిసిషన్ తీసేసుకున్నాడు అశ్విన్. అయితే..నాలుగో టెస్ట్‌కి చాలా గ్యాప్ ఉండడం వల్ల...అశ్విన్‌ని రీప్లేస్ చేయడంపై ఆలోచిస్తామని రోహిత్ వెల్లడించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram