ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్

Continues below advertisement

టీమిండియా విమెన్స్ జట్టు విమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిందంటే.. దానికి కారణం ఫైనల్ మ్యాచ్‌లో 87 రన్స్‌తో ఇరగదీసిన షెపాలీ వర్మ అని కొందరంటుంటే.. కాదు.. ఆల్ పెర్ఫార్మెన్స్‌తో బ్యాటింగ్‌లో 57 రన్స్ చేసి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. 5 వికెట్లు తీసి సఫారీ టీమ్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టిన దీప్తి శర్మ కారణమని ఇంకొంతమంది అంటున్నారు. కానీ ఇండియన్ మెన్స్ టీమ్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. వీళ్లిద్దరూ కాదు.. తెలుగమ్మాయి శ్రీచరణి వల్లే టీమిండియా వరల్డ్ గెలిచిందంటున్నాడు.

రీసెంట్‌గా తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడిన అశ్విన్.. విమెన్ స్పిన్నర్, తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీ మొత్తం శ్రీ చరణి సూపర్ పెర్ఫార్మెన్స్‌‌తో అదరగొట్టిందని.. టీమిండియా ట్రోఫీ కొట్టిందంటే ఆ క్రెడిట్ ఆమెకే దక్కుతుందన్నాడు. ఆమె బౌలింగ్ టెక్నిక్ అద్భుతం. బంతి తిప్పే విధానంతో పాటు వేగంగా బంతులు వేయడంతో ప్రత్యర్థులని శ్రీచరణి భయపెట్టగలదని పొగుడుతూనే.. ఆమె ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవుతుందంటూ ఆకాశానికెత్తేశాడు.

మొత్తం టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టిన శ్రీ చరణి.. పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో 5 వికెట్లు పడగొట్టి టీమ్ గెలుపులో కీ రోల్ పోసించింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ కూడా టీమిండియాలో మోస్ట్ డేంజరస్ బౌలర్ శ్రీచరణి అని చెప్పిందంటే.. మన కడపబిడ్డ పవర్ ఏంటో అర్థం చేసుకోండి. ఒకవైపు కన్‌సిస్టెంట్‌గా వికెట్లు పడగొట్టడమే కాకుండా.. అపోజిషన్ టీమ్ ఏ మాత్రం రన్స్ చేయకుండా కట్టడి చేస్తూ టోర్నీ మొత్తం టీమిండియా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ని ముందుడి నడిపించింది. కప్పు గెలిపించింది. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ తరపున ప్రపంచకప్ ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు కూడా తెచ్చుకుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola