Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ ప్లాన్ గురించి మాట్లాడుతూ.. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పోలుస్తూ గంభీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"2023 మెగా టోర్నీ ముగిసిన వెంటనే రాబోయే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. వన్డే స్పెషలిస్ట్‌లు ఎవరు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి అనే విషయాల్లో ద్రవిడ్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నారని" గుర్తుచేశారు.
ద్రవిడ్‌పై గతంలో విమర్శలు వచ్చినా, ఆయన హయాంలో టీమ్ అద్భుతమైన స్టెబిలిటీ ఉందని అశ్విన్ స్పష్టం చేశారు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను ద్రవిడ్ కాపాడుకున్న తీరును మెచ్చుకున్నారు. "సోషల్ మీడియా విమర్శలను పక్కనపెట్టి, ద్రవిడ్ హయాంలో ఆడిన ఏ క్రికెటర్‌నైనా అడగండి.. కోచ్‌గా ఆయన ఎంత పర్‌ఫెక్టో తెలుస్తుంది" అని గంభీర్‌పై ఘాటు కామెంట్స్ చేసారు.