Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్

Continues below advertisement

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆఫ్-స్పిన్నర్లలో ఒకరు హర్భజన్ సింగ్. తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో తనకు లభించిన ఒక 'గోల్డెన్ అడ్వైస్' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్ తనకు ఇచ్చిన ఆ సలహా తన గేమ్ ను, అలాగే తన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో భజ్జీ వివరించారు.

సక్సెస్ వచ్చినప్పుడు జీవితంలో అనేక రకాల డిస్ట్రాక్షన్స్ రావడం సహజమని, అయితే వాటిని పక్కన పెట్టి కేవలం గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని సచిన్ పాజీ తనకు సూచించారని హర్భజన్ గుర్తు చేసుకున్నారు.

మా సీనియర్లు ఎప్పుడూ గొప్పోలే. మనకున్న పరిమితుల్లోనే మనం మంచి ప్రదర్శన ఇవ్వాలని వారు కోరుకుంటారు. నా లైఫ్‌లో నాకు లభించిన బెస్ట్ అడ్వైస్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిందే. 'నీ లైఫ్‌లోకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, రకరకాల వ్యాపార ఆఫర్లు, ఆకర్షణలు వస్తాయి. కానీ గుర్రానికి కళ్లేలు కట్టినట్లు నువ్వు లెఫ్ట్, రైట్ చూడకూడదు. నీ కళ్ల ముందు కనిపించాల్సింది ఒక్కటే... అదే క్రికెట్. ఈ మార్గంలోనే నువ్వు నిలకడగా నడిస్తే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ఆపలేరు అని సచిన్ నాకు చెప్పారు" అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola