Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్

Continues below advertisement

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు క్రికెట్ ఫీవర్‌తో పాటు మెగా గ్లామర్ కూడా తోడు కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది టీమ్ ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనుంది.

పెద్ది పవర్ ప్లే టూర్ పేరుతో మూవీ టీమ్ ఉప్పల్ స్టేడియంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి సిద్ధం చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో నటిస్తుండటంతో, ఐపీఎల్ వేదికను ప్రమోషన్స్ కోసం ఎంచుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెగా ఈవెంట్‌లో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా పాల్గొనే అవకాశం ఉంది. మ్యాచ్ మధ్యలో వచ్చే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో చిత్ర యూనిట్ నేరుగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ కానుంది.

ఈ ఐపీఎల్ లో సినిమాకు సంబంధించిన ఏదైనా స్పెషల్ గ్లింప్స్ వీడియో లేదా సాంగ్ ప్లే చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. హోమ్ గ్రౌండ్‌లో ఒకవైపు ఆరెంజ్ ఆర్మీ హంగామా, మరోవైపు మెగా పవర్ స్టార్ ఎంట్రీతో ఉప్పల్ స్టేడియం ఊగిపోవడం ఖాయం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola