Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్యా రహానే ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా భారత టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ పై కామెంట్స్ చేసారు. టెస్ట్ ఫార్మాట్‌లో పూర్వ వైభవం సాధించాలంటే యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని రహానే స్పష్టం చేశాడు. టీమ్ లో ఏడుగురు లేదా ఎనిమిది మంది సీనియర్లు, ముగ్గురు లేదా నలుగురు యంగ్ ప్లేయర్స్ ఉంటేనే సరైన కాంబినేషన్ కుదురుతుందని అన్నాడు.
ప్రస్తుతం సీనియర్లందరూ ఒకేసారి రిటైర్ అవ్వడం లేదా దూరమవ్వడం వల్ల టీమ్ లో బ్యాలన్స్ దెబ్బతింటోందని, మిగిలిన సీనియర్ ప్లేయర్స్ ను గౌరవించడం చాలా అవసరమని చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా భారత్ స్వదేశంలో కూడా టెస్టులు ఓడిపోవడం చూస్తుంటే బాధగా ఉందని, అసలు టెస్ట్ క్రికెట్ మనుగడపైనే భయంగా ఉందని అన్నాడు.
ఇక విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. మైదానంలో కోహ్లీ దూకుడు, తన ప్రశాంతత జోడీగా మారి టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించామని తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటని తాను ఎన్నిసార్లు అడిగినా కోహ్లీ చెప్పలేదని నవ్వుతూ వెల్లడించాడు. గ్రౌండ్ బయట కూడా తమ మధ్య మంచి స్నేహం ఉండేదని, ఇద్దరం క్రికెట్ గురించి గంటల తరబడి చర్చించుకునేవాళ్లమని తెలిపాడు.